మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెల అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు. కోడెల, అతని కొడుకు, కూతురు అవినీతి, అక్రమాలపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నాడు. స్పీకర్‌గా పనిచేసిన అత్యంత హీనమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరని గూగుల్‌లో సెర్చ్ చేస్తే కోడెల, ఆయన దూడల పేర్లు కనిపిస్తున్నాయి. రోజుకో కేసు బయట పడుతున్నా పచ్చ పార్టీ వారిని రక్షిస్తోంది. చంద్రబాబు రహస్యాలు కోడెల గుప్పిట్లో ఉండబట్టే మాట వరసకైనా ఆయన నేరాలను ఖండించడం లేదని అన్నారు.