Home / EDITORIAL / నాడు ఇందిర, నేడు మోదీ

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్భంలో కలసిపోతారు. ఇప్పుడు నరేంద్ర మోదీకి, ఆయన మిత్రు డు అమిత్ షాకు అటువంటి దశే నడుస్తున్నది. ఒకప్పుడు చిదంబ రం ఇటువంటి దశనే అనుభవించాడు. అది శాశ్వతం కాలేదు. ఇప్పుడున్నదీ శాశ్వతం కాదు. ఆ రోజు అమిత్ షాను చిదంబరం వెంటాడారు. ఇవ్వాళ చిదంబరాన్ని అమిత్ షా వెంటాడుతున్నారు. ఎవరూ పవిత్రులు కారు. బయటున్నవారు నేరా లు చేయలేదని కాదు, లోపలున్నవారూ అమాయకులని చెప్పలేం. కాలచక్రం మనుషుల స్థానాలను మార్చుతుంది-అంతే. సమాజం గుర్తు పెట్టుకునే మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోతారు కొందరు. సమాజం భరించలేని, మరిచిపోలేని ఘోరాలు చేసి చరిత్రకెక్కుతారు ఇం కొందరు. మానవజాతి చరి త్ర అంతా ఇలాగే జరిగింది. బుద్ధుడిని ఒకందుకు గుర్తుపెట్టుకుంటాం. అశోకుడిని ఆదర్శాలకు తలొగ్గినందుకు గుర్తుపెట్టుకుంటాం. మౌర్యు లు, శాతవాహనులు, కాకతీయులు- వారిని వారు చేసిన మంచిపనులతో గుర్తుపెట్టుకుంటాం. అలెగ్జాండర్‌ను, ఘోరీలను, గజనీలను, హిట్లర్‌లను వారి యుద్ధపిపాసను ద్వేషిస్తూ గుర్తుపెట్టుకుం టాం. మానవజాతికి వారు చేసిన ద్రోహాలను మననం చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటాం. ఆధునిక రాజకీయ నాయకత్వం చరిత్రను మరిచిపోకూడదు. ఇదే శాశ్వతమని విర్రవీగకూడదు. మంచిని పెంచి, మంచిని ప్రచారం చేసి, మంచిపనులు చేసి చరిత్రలో నిలిచిపోవాలి. విద్వేషాన్ని ప్రచారం చేసి, అబద్ధాలను సమాజంపై కుమ్మరించి, ఇష్టారాజ్యంగా వ్యవహరించి, ప్రజలను మభ్యపెట్టి చరిత్రలో నిలిచిపోయిన నాయకులు లేరు.

బీజేపీ ఆర్థికరంగంలో విఫలమై, ఆ కష్టనష్టాలను అందమైన తివాచీ కింద కప్పిపెట్టి, భావోద్వేగ రాజకీయాలపై ఆధారపడుతున్నది. అందులో 370 అధికరణ రద్దు ముందుగా వచ్చింది. అది ఉండి కశ్మీరు ప్రజలను రక్షించిందీ లేదు. అదిపోయి కశ్మీరు ప్రజలకు కొత్తగా వచ్చే నష్టమూ లేదు. అది తప్పా ఒప్పా అన్న చర్చ అనవసరం. అక్కడ అన్ని చట్టాలు అసంబద్ధం అయినప్పుడు ఫలా నా చట్టం ఉంది ఫలానా చట్టం పోయింది అన్న చర్చ ఎందుకు? కశ్మీరును ఉద్ధరించడానికే 370 అధికరణం ఎత్తివేశామని, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించామని కేంద్రం చెబుతున్నది. అదే పని ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు చేయరు? వినిమయ ఆధారిత మానవాభివృద్ధి సూచిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల కంటే కశ్మీరు ముందున్నది.

తెలంగాణపై ఇప్పుడు బీజేపీ నాయకత్వం చేస్తున్న దాడి వారి బరితెగింపును, అడ్డగోలుతనాన్ని తెలియజేస్తున్నది. నిన్నమొన్నటిదాకా తెలంగాణలో ప్రతి పథకాన్ని మెచ్చుకున్న కేంద్ర మంత్రులు, కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు పథకాలను తూ.చ. తప్పకుండా కేంద్రం లో అమలుచేయడానికి ముందుకొచ్చిన బీజేపీ నాయకులు మొన్న టి ఎన్నికల తర్వాత నాలుక తిప్పేసి మాట్లాడుతున్నారు. రైతుబం ధు, రైతు బీమా, జల్‌జీవన్.. మీ పథకాలకన్నిటికీ స్ఫూర్తి ఎవరు లక్ష్మణ్నా! ఇది దాచేస్తే దాగని సత్యం. మీ మంత్రులు, కేంద్ర అధికారులు చేసిన ప్రకటనలన్నీ అచ్చులో ఉన్నాయి. వీడియోల్లో ఉన్నాయి. మీతో బాగుంటే మంచోళ్లా. మీకు దూరంగా ఉంటే శత్రువులా! గోదావరి నీళ్ల కోసం యాత్రలంటూ రాష్ట్రమంతా తిరిగిన రోజులు మరిచిపోయారా? ఇవ్వాళ అదే గోదావరిని తెలంగాణ బీళ్లకు మళ్లిస్తుంటే ప్రాజెక్టుల కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారెందుకు? కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారెందుకు? అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారా? బ్యాంకు రుణాల ఎగవేతదారులతో దాగుడుమూతలు ఆడుతున్నవారు, పారిశ్రామిక సామ్రాజ్యాలకు అన్ని రకాలా ఊడిగం చేస్తున్నవారు, యుద్ధ విమానాల కొనుగోలులో ఇష్టారాజ్యంగా వ్యవహరించినవారు, రాజకీయాల్లో అవినీతికి అధికార ముద్రలు వేసినవారు, ఎమ్మెల్యేలను, ఎంపీలను, కొన్ని రాష్ర్టా ల్లో ప్రభుత్వాలనే కొనిపారేసిన వారు అవినీతి గురించి మాట్లాడితే జనం నవ్విపోరా? ఈశాన్యంలో రాష్ర్టాలు ఎలా మీ చేతికి వచ్చా యి? ఇప్పుడు సిక్కింలో జరుగుతున్నదేమిటి? కర్ణాటకలో జరిగిందేమిటి? అక్కడి ముఖ్యమంత్రి, ఆయన మద్దతుదారులైన మైనింగ్ మాఫియా ఎంతటి పరిశుద్ధులో పక్కనే ఉన్న తెలంగాణ ప్రజలకు తెలియదా? మాది భిన్నమైన పార్టీ, పరిశుద్ధ రాజకీయాలకు అంకి తమని అలనాడు వాజపేయి చెప్పిన నీతులను ఏ గోతిలో పాతిపెట్టారు? కాంగ్రెస్ ఇన్నేండ్లు చేసిన రాజకీయ దాష్టీకాలకు, మీరు ఈ నాలుగైదేండ్లలో చేసిన దాష్టీకాలకు తేడా ఏమైనా ఉందా? గురివిందకు గుర్తులుగా మారి నిందలు వేయవద్దు.

ఇందిరాగాంధీ రాజభరణాలను రద్దుచేసి, బ్యాంకులను జాతీయీకరణ చేసినప్పుడు దేశమంతా అబ్బో అని అన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం గెలిచినప్పుడు, బంగ్లాదేశ్‌కు విముక్తి సాధించినప్పు డు ఆమెను ఆకాశానికెత్తారు. అదే ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజ్యాంగ విలువలను పాతరేసి ఇష్టారాజ్యంగా రాజకీయ దౌష్ట్యాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ కూడా 1984లో ఆమె దౌష్ట్యాన్ని అనుభవించింది, మొక్కవోని ధైర్యంతో తిప్పికొట్టింది. ఇప్పుడు బీజేపీ చేస్తున్నదీ అదే. అప్పుడూ ఆమె మందబలం, ఏకపక్ష రాజకీయ బలమే చూసుకొని ఇష్టారీతిన వ్యవహరించారు. ఇప్పుడు బీజేపీ అదే ఏకపక్ష రాజకీయబలాన్ని చూసుకునే వ్యవహరిస్తున్న ది. బీజేపీ చేస్తున్నవన్నీ కాస్మెటిక్ రాజకీయాలు. 370 అధికరణాన్ని రద్దు చేయడం కేవలం రాజ్యాంగపరమైన పేపర్ వర్కు. అది ఉన్నా లేకపోయినా కశ్మీరును చక్కదిద్దడానికి కేంద్రానికి మునుపు లేని అధికారాలు లేవు. ఇప్పుడు కొత్తగా సంక్రమించిన అధికారాలు లేవు. కానీ 370 అధికరణాన్ని ఎత్తివేయడంతోనే దేశానికేదో మరోసారి స్వాతంత్య్రం వచ్చిందన్నంత ఉద్వేగాలను ఈతరంలో రేపెట్టడంలో బీజేపీ విజయవంతమైంది.

సైన్యం జీపుకు ఒక మనిషిని ముందుకట్టి అల్లరి మూకలతో యుద్ధం చేయడానికి మించిన అధికారం ఏముంటుంది? కశ్మీరులో ఐదేండ్ల దారుణ వైఫల్యాలను ఒక్క పేపర్ వర్కుతో తుడిచిపడేసింది. బీజేపీకి ఎక్కడ కలిసివచ్చిందంటే దేశంలో 60 శాతం మంది 40 ఏండ్లలోపు వారు. అంటే 1980ల తర్వాత జన్మించిన తరం. వారిలో చాలామందికి దేశ చరిత్రగానీ, ప్రపంచ చరిత్రగానీ తెలియదు. రాజకీయ భావజాలాలు, వాటి సంఘర్షణ గురించిన అనుభవం లేదు. అడుగడుగునా స్వాతంత్య్రోద్యమానికి వెన్నుపోటు పొడిచి, బ్రిటిషు వారి కనుసన్నల్లో బతికిన వారి గురించి తెలియదు. అంబేద్కర్ వాదాన్ని చేం బర్ ఆఫ్ హారర్స్ అని దాడిచేసిన వారి గురించి తెలియదు. స్వాతంత్య్రోద్యమంలో ఏ రోజూ పాల్గొనకపోగా, మతవాద దృష్టితో మహాత్మాగాంధీని హతమార్చిన వారి గురించి తెలియదు. మన రాజ్యాంగాన్ని తిరస్కరించి, మనుస్మృతిని రాజ్యాంగం చేయాలని వాదించిన వారి గురించి తెలియదు. జాతీయ జెండాను నిరాకరించి కాషాయ జెండానే జాతీయజెండా చేయాలని వాదించిన వారి గురించి తెలియదు. ఆరు దశాబ్దాల పాటు జెండాకు దండంపెట్టని వారి గురించి తెలియదు.

బీజేపీ ఆర్థికరంగంలో విఫలమై, ఆ కష్టనష్టాలను అందమైన తివాచీ కింద కప్పిపెట్టి, భావోద్వేగ రాజకీయాలపై ఆధారపడుతున్నది. అందులో 370 అధికరణ రద్దు ముందుగా వచ్చింది. అది ఉండి కశ్మీరు ప్రజలను రక్షించిందీ లేదు. అదిపోయి కశ్మీరు ప్రజలకు కొత్తగా వచ్చే నష్టమూ లేదు. అది తప్పా ఒప్పా అన్న చర్చ అనవసరం. అక్కడ అన్ని చట్టాలు అసంబద్ధం అయినప్పుడు ఫలా నా చట్టం ఉంది ఫలానా చట్టం పోయింది అన్న చర్చ ఎందుకు? కశ్మీరును ఉద్ధరించడానికే 370 అధికరణం ఎత్తివేశామని, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించామని కేంద్రం చెబుతున్నది. అదే పని ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు చేయరు? వినిమయ ఆధారిత మానవాభివృద్ధి సూచిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల కంటే కశ్మీరు ముందున్నది. అక్షరాస్యత, తలసరి ఆదాయం, మౌలి క వసతులు వంటి అంశాల్లో బీజేపీ రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కంటే కశ్మీరు ముందున్నది.

ఉత్తరప్రదేశ్‌లో మొన్న లోక్‌సభ ఎన్నికలు ముగిసిననాటి నుంచి కరెంటు కోతలతో అక్కడి ప్రజలకు నరకం చూపిస్తున్నారు. మానవాభివృద్ధి సూచీలో రాజస్థాన్, గుజరాత్‌లు జాతీయ సగటుకంటే ఉత్తమంగా ఉన్నా కశ్మీరు తర్వాతే ఉన్నాయి. ఇవన్నీ అధికారిక లెక్కలే. మరి అక్కడ ఏమి ఉద్ధరించారని, ఇప్పుడు కశ్మీరులో ఉద్ధరిస్తారు? అభివృద్ధి ఎజెండా చేతగాకే బీజేపీ భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. ఒక తరాన్ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నది. దేశ రాజకీయ వ్యవస్థకు తాను చేస్తున్న మానని గాయాలను అందమైన నినాదాల కట్టుమాటున దాచిపెట్టాలని చూస్తున్నది. అయితే చరిత్ర చెప్పినట్టు బీజేపీయే శాశ్వతం కాదు. రాజకీయాలు గతిశీలమైనవి. కాబట్టే బీజేపీ తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచిం ది. కాబట్టే రేపు మళ్లీ మార్పు అనివార్యం. ప్రజలు ఎప్పుడూ కళ్లు మూసుకొని ఉండరు. కొన్ని చరిత్ర నుంచి తెలుసుకుంటారు. కొన్ని అనుభవాల నుంచి నేర్చుకుంటారు. తమకు అవకాశం వచ్చినప్పు డు పాఠాలు చెబుతారు. Source :Namasthe Telangana

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat