దాయాది దేశమైన పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ క్రమంలో తన భూభాగం పరిధిలోని సట్లేజ్ నదిపై ఉన్న గేట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎత్తివేసింది. దీంతో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల్లోకి నీళ్లు చేరుకున్నాయి. సరిహద్దుల్లోని చివరి గ్రామం తెండీవాలాను నీళ్లు పూర్తిగా చుట్టిముట్టాయి. దీంతో సైన్యం ,అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు..
