మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి అంటే అప్పట్లో మోస్ట్ పాపులర్ జోడి అదే. వీరిద్దరు కలిసి దాదాపు 15లో నటించారు. వీరు నటించిన ప్రతీ చిత్రం కూడా సూపర్ హిట్ నే. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 26 సంవత్సరాలు తరువాత ఇద్దరు కలిసి నటించబోతున్నారని సమాచారం.ప్రస్తుతం చిరు సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో విజయశాంతి కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో ఈ రాములమ్మ కీలక పాత్ర పోషించబోతుందని సమాచారం. అయితే 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమానే వీరికి చివరిది. విజయశాంతి సినిమాల్లో మల్లా 2006లో నాయుడమ్మ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.మరి ఈ విషయం పై ఇంకా ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.