తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత ,మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా ఈ రోజు సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్‌రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు.
శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీ నర్సింహాచార్యులు గత సోమవారం అధికారికంగా ప్రకటించి.. గుత్తాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. 2021 జూన్ మూడు వరకు గుత్తా ఎమ్మెల్సీగా ఈ పదవీలో కొనసాగనున్నారు.