తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పాఠశాల విద్యాశాఖలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ నెలలో చేపట్టిన హాజరు మాసోత్సవంతో మంచి ఫలితం కనిపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, ప్రాధాన్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు కూడా ముందుకువస్తున్నారు.
ఇది శుభపరిణామంగా భావిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ప్రతిరోజూ తరగతులకు వస్తే సహజంగానే విద్యాభ్యాసం బాగుంటుందని, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో హాజరు పెరిగిందని అన్నారు.