చంద్రబాబు ఇంటిని, అమరావతిని ముంచాలని ప్రభుత్వం చేసిన కుట్రకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నేత దేవివేని ఉమా మహేశ్వరరావు అన్నారు. వరదల కారణంగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదం వల్లే నేడు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కొందరు ప్రభుత్వంపై నోరు పారిసుకున్నారు.. ఇప్పుడు వారు మంత్రులు అయినా కూడా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. వరద బాధితులను ఆదుకోవడం కన్నా.. సీఎంకు ఢిల్లీ పర్యటనే ముఖ్యమైందని విమర్శించారు. ఇంకా పోలవరం పనులపై సీఎం జగన్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వేయడం హాస్యాస్పదం అని అన్నారు. వైఎస్ హయాంలో జరిగిన పోలవరం పనులపై విచారణ ఎందుకు చేపట్టరని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన పనులన్నీ పూర్తి పారదర్శకంగా ఉన్నాయని ఈ విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలని దేవినేని ఉమా ఫైర్ అయ్యారు.
