గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి అరకిలో మీటరు దూరంలో భారీ పేలుడు సంభవించింది. స్థానిక కృష్ణా నగర్‌లో ఈ పేలుడికి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువతి కంటి చూపును కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పేలుడు తీవ్రతకు చుట్టూ ఉన్న ఇండ్లకు పెద్దగా నష్టం జరుగలేదు. అయితే గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా సీఎం జగన్ ఇంటికి కూతవేటు దూరంలో ఈ పేలుడు సంభవించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా సీఎం జగన్ ఇంటికి సమీపంలో భారీ పేలుడు ఘటన తాడేపల్లిలో చర్చనీయాంశంగా మారింది.
