రాష్ట్రంలో పెద్దఎత్తున సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులైన వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్ రంగయ్య, కసనూరు పరమేశ్వర్ రెడ్డి, దిద్దెకుంట శేఖర్ రెడ్డి లను దాదాపుగా 20 రోజులక్రితం సిట్ బృందం పులివెందుల కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్ పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో గల ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లినా ఆ నలుగురిలో తాజాగా ఇద్దరికి నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తయ్యాయి. నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తి చేసుకున్న వాచ్‌మన్ రంగయ్యను, ఎర్రగంగి రెడ్డిని కడప పోలీసులు తీసుకొచ్చి ఈ శనివారం పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. ఈకేసులో అనుమానితులుగా ఉన్న కసనూరు పరమేశ్వర్ రెడ్డి, దిద్దెకుంట శేఖర్ రెడ్డి లకు కూడా నార్కో పరీక్షలు పూర్తయిన తర్వాతే ఈ నలుగురు సిట్ అధికారుల విచారణలో ఏం వెల్లడించారనే విషయాలు జోడించి తెలిసుకునే అవకాశం ఉంది. దాదాపుగాఐదు నెలలుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ హత్య రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే.
Home / ANDHRAPRADESH / వివేకా హత్య కేసులో కీలక మలుపు.. నిందితులను గుజరాత్‌లోని గాంధీనగర్ తీసుకెళ్లిన పులివెందుల పోలీసులు
Tags ap gujarat investigation jagan politics ys vivekananda reddy ysrcp