Home / ANDHRAPRADESH / టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌కు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం లోకేష్‌కు అరెస్ట్‌ తప్పదా…!

టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌కు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం లోకేష్‌కు అరెస్ట్‌ తప్పదా…!

ఏపీ నీటి పారుదల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషిస్తూ శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ఓ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై వైసీపీ నేతలు అరెస్ట్ చేయడంతో విజయవాడ పోలీసులు శేఖర్ చౌదరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న శేఖర్ చౌదరి పోలీసుల విచారణలో లోకేష్ టీమ్ ఆదేశాల మేరకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కులం పేరుతో దూషించానని తెలిపినట్లు సమాచారం. దీంతో . శేఖర్ చౌదరి ఉద్దేశ్యపూర్వకంగా మంత్రిని దూషించడం వెనుక అసలు స్కెచ్ ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక గౌరవ మంత్రి పదవిలో ఉన్న అనిల్‌కుమార్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన శేఖర్ చౌదరికి రమారమి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శేఖర్ చౌదరి గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాలపై టీడీపీ రూపొందించిన పలు యాడ్స్‌లో నటించాడు. ఇప్పుడు ఏకంగా మంత్రిని కులం పేరుతో దూషించాడు.

50 రోజుల్లోనే దేశంలోనే 3 వ బెస్ట్ సీఎంగా పేరుగాంచిన సీఎం జగన్, సంక్షేమ పథకాలతో ప్రజల మన్నలను పొందిన వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతో లోకేష్‌లో ఆదేశాల మేరకు టీడీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగిందని సమాచారం.. సమాజంలో వివిధ వర్గాలకు చెందిన వారితో , ప్రభుత్వ విధానాలను దురుద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ..సీఎం జగన్ని , ముఖ్య వైసీపీ నేతలను కించపరుస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇటీవల ఆరోగ్య శ్రీ అందడం లేదంటూ…ఒక మహిళ సీఎం జగన్‌ని విమర్శిస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో వెనుక ఆర్టిస్టులకు మేకప్ వేస్తున్నట్లు కనిపించయడంతో టీడీపీ సోషల్ మీడియా గుట్టు బట్టబయలైంది. లోకేష్ టీమ్‌ ఆదేశాల మేరకు మంత్రిని కించపరిచిన శేఖర్ చౌదరికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వాన్ని దురుద్ద్యేశపూర్వకంగా బద్నాం చేస్తూ రూపొందించిన వీడియోలలో నటించే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌లను కూడా త్వరలో గుర్తించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో ఈ పెయిడ్ వీడియోలు రూపొందిస్తున్న డైరెక్టర్లు, నిర్మాతలు, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు జైలుకు పోక తప్పదని పోలీసులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం వెనుక లోకేష్ టీమ్ ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇది కచ్చితంగా లోకేష్ పనే అని…ఇలా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పెయిడ్ ఆర్టిస్ట్‌లను రంగంలోకి దింపే చీప్ ట్రిక్స్ లోకేష్‌ దగ్గరే ఉన్నాయని…ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో లోకేష్‌ కూడా జైలుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. మొత్తంగా సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా వీడియోలు తీసే టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల తాట తీసేందుకు పోలీసులు రెడీగా ఉన్న వార్త తెలుగు తమ్ముళ్లలో ఆందోళన కలిగిస్తోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat