టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుంగు మిత్రులన్న సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బహిరంగంగా చంద్రబాబుకు మద్దతు పలికి, టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి పవన్ సహకరించాడు. దీనికి ప్రతిఫలంగా పవన్‌కు బాబు నుంచి భారీగా ప్యాకేజీ అందినట్లుగా, పవన్ ప్యాకేజీ స్టార్ అని ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ అధికార టీడీపీ పార్టీని ప్రశ్నించేది పోయి..ప్రతిపక్ష పార్టీ వైసీపీని టార్గెట్ చేసేవాడు. అంతే కాదు తన పార్టనర్ చంద్రబాబు చేసే అవినీతి, అక్రమాలపై ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పోరాటం చేసినప్పుడల్లా పవన్ రంగంలోకి దిగేవాడు. రాజధాని భూముల విషయంలో కావచ్చు..అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కావచ్చు…పోలవరం నిర్వాసితుల విషయంలో కావచ్చు..తన పార్టనర్ చంద్రబాబుకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా పవన్ ఎంట్రీ ఇచ్చి…సమస్యను పక్కదారి పట్టించేసేవాడు. అంతే కాదు ఎలక్షన్ల సమయంలో చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా అభ్యర్థులను ప్రకటించి…చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ మంత్రులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులను నిలబెట్టకుండా..కనీసం ప్రచారం చేయకుండా, టీడీపీ బలంగా ఉన్న చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాడు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు పదే పదే ప్రతిపక్ష నాయకుడు జగన్ని టార్గెట్ చూస్తూ తీవ్ర విమర్శలు చేస్తాడు. అయితే ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవడం, వైసీపీ అఖండ విజయం సాధించడం..పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. దీంతో గత కొంత కాలంగా సైలెంట్ అయిన పవన్ తన పార్టనర్ చంద్రబాబుకు ఇబ్బంది రావడంతో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు.
మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ…అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటూ గత కొద్ది రోజులుగా చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ నుంచి కానీ, వైసీపీ ప్రభుత్వం నుంచి రాజధాని విషయంలో అధికారికంగా ఏ ప్రకటన రాకపోయినా.. రాజధానిని వైసీపీ సర్కార్ తరలిస్తుందంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిలించాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. అమరావతిపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో టీడీపీ నేతలు భూములిచ్చిన రైతులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. అయితే రైతుల్లో ఒక వర్గం తప్ప…మిగిలిన వారంతా జగన్‌పై భరోసాగా ఉండడంతో ఏమి పాలుపోలేని చంద్రబాబు తన పార్టనర్ పవన్‌ను రంగంలోకి దింపుతున్నాడు.
రాజధానిలో మెజారిటీ శాతం భూములు బాబు సామాజికవర్గానికి చెందినవారివే ఉన్నాయి. రాజధాని విషయంలో జరుగుతున్న ప్రచారం వల్ల హైప్ తగ్గుతుందని, దీంతో భూముల విలువ తగ్గిపోతుందని బాబు భయం. అంతే కాదు ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తుంది. దీంతో అమరావతితో పాటు పారిశ్రామిక, ఐటీ క్యాపిటల్‌గా ఇంకో నగరం ఉండబోతుంది. దీంతో అమరావతికి అంతగా ప్రాధాన్యత ఉండదని బాబు అనుమానం. ఇది బాబుకు అస్సలు ఇష్టం లేదు..అందుకే రైతులను రెచ్చగొట్టడానికి తన పార్టనర్‌ను పవన్‌ను దింపుతున్నాడు. బాబు ఆదేశాల మేరకు ఉన్నట్లుండి రాజధాని అంశంపై పవన్ స్పందించాడు. త్వరలోనే పవన్ అమరావతి ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటిస్తారంట. అమరావతిపై హైప్ తగ్గుకుండా..తద్వారా తమ సామాజికవర్గానికి చెందిన వారి భూములు విలువ తగ్గకుండా బాబు వేసిన స్కెచ్‌లో భాగంగా పవన్ అమరావతిలో పర్యటించబోతున్నారు. మొత్తంగా బాబు చెప్పాడు…పార్టనర్ పాటిస్తున్నాడు అంటూ పవన్‌పై వైసీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. సో..అమరావతి పర్యటన నేపథ్యంలో మరోసారి బాబు, పవన్ ల మధ్య ఉన్న రహస్యబంధం మరోసారి బట్టబయలైంది.