చేజారిన ఆరోగ్యాన్ని ఎం చేయలేము.. చేజారక ముందే ఆరోగ్యాన్ని కాపాదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని..ప్రతి ఒక్కరు పిట్ నెస్ ను పెంపడించుకోవాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఫిట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కె రన్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషికి ఆరోగ్యం కంటే విలువైనది ఏది లేదని.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు . ప్రభుత్వ ఆసుపత్రిల్లో పేషంట్స్ ఎక్కువ ఉన్నారు అంటే ఎక్కువ అనారోగ్యంతో ఉన్నట్టే అని.. మన చేజారిన ఆరోగ్యాన్ని ఎంత చేసిన వృధానే అని..చేజారక ముందే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు…అందుకే ఇలాంటి ఫిట్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పారు.. మనవ మనుగడ మొక్కల పై ఆధారపడి ఉంది అని..మొక్కలు నాటాలి..వాటిని సంరక్షించడం మన అందరి బాధ్యత అని సూచించారు..ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమని చెప్పారు… భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు యోగ , ప్రాణాయామం చేయాలని ఆదిశగా ఈమధ్య లో ఒక ఆలోచన చేశామని , సిద్దిపేట ప్రజల ఆరోగ్యానికి అడుగులు వేస్తున్నామన్నారు.. మంచి ఫిట్ నెస్..మంచి ఆరోగ్యమని చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి విద్యార్థులకు యోగ ప్రాణాయామం చేపించుతునట్లు చెప్పారు.. ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలన్నదే నా తపన అని , యోగ, వాకింగ్ దేహ దారుడ్య నైపుణ్యాలను పెంపుడించొకోవాలని సూచించారు..ప్రతి ఒక్కరు యోగ , ప్రాణాయామం చేయాలని కోరారు.. ఫిట్ ఫౌండేషన్ సంస్థ మంచి ఇన్నోవేట్ కార్యమాలు చేయడం అభినందనియమని చెప్పారు..10 కె రన్ లో విజేతలు గా నిలిచిన వారికి బహుమతుల ప్రధానం చేశారు…
