చంద్రబాబు గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే టైపు అని మరోసారి రుజువైంది. గత ఐదేళ్ల పాలనా కాలంలో చంద్రబాబు ప్రజల కోసం ఖర్చు పెట్టినదానికంటే..వ్యక్తిగతంగా తన సొంతానికి ప్రజల సొమ్మును ఖర్చు పెట్టిందే ఎక్కువ. రాజధానికి శంకుస్థాపనల పేరుతో, పోలవరంలో ఆ మట్టి పని, ఈ కాంక్రీట్ పని, కాఫర్ డ్యామ్ పనులు అంటూ కోట్లాది రూపాయలతో అట్టహాసంగా శంకుస్థాననల మీద శంకుస్థాపనల పేరుతో, స్పెషల్ ఫ్లైట్లలో విమాన యాత్రల పేరుతో…ప్రతి ఏటా నవ నిర్మాణ దీక్షలతో పేరుతో, జలహారతిలపేరుతో, నీరు చెట్టు పేరుతో…ఇలా వేలాది కోట్ల ప్రజల సొమ్మును చంద్రబాబు తన ఇష్టానికి, హంగూ ఆర్బాటాలకు తగలేశాడు. తాజాగా మోదీతో వైరం పెట్టుకున్న చంద్రబాబు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీలో ధర్మపోరాటదీక్ష చేపట్టాడు. ఈ దీక్షకు జాతీయ స్థాయిలో కొంత మంది ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించాడు. అయితే వ్యక్తిగతంగా చేపట్టిన ఈ దీక్షకు చంద్రబాబు సర్కార్ భారీ స్థాయిలో నిధులు వెచ్చింది.
తాజాగా ఈ ధర్మపోరాట దీక్షకు 4 కోట్ల టీటీడీ నిధులు కూడా ఖర్చు పెట్టిన సంగతి బయటపడింది. గత తిరుమల తిరుపతిలో ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విజిలెన్స్ కమీషన్ ఏర్పాటు చేసింది. దీంతో ధర్మపోరాట దీక్షకు 4 కోట్ల టీటీడీ నిధులు చేపట్టిన విషయంపై విచారణకు ఆదేశించబోతున్నారని ముందే తెలుసుకున్న చంద్రబాబు బస్ టికెట్లపై అన్య మత ప్రచారం అంటూ, అమెరికాలో హారతులని గొడవ మొదలెట్టి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూశాడు. అయితే బస్ టికెట్లపై అన్య మత ప్రచారం ముద్రణ చంద్రబాబు హయాంలో జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో బాబు బండారం బట్టబయలు అయింది. ఇక అమెరికాలో దీపం వెలిగంచలేదని చేసిన టీడీపీ చేసిన దుష్ప్రచారం బూమరాంగ్ అయింది. దీంతో 4 కోట్ల నిధులు ధర్మపోరాట దీక్షకు ఖర్చు పెట్టారన్న అంశాన్ని పక్కదారి పట్టించడానికి బాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయ్యా బాబుగారు..మీ ఎల్లో మీడియాతో ప్రజలను మోసం చేయవచ్చేమో కానీ..వెంకన్న స్వామిని మోసం చేయలేరు. సాక్షాత్తు గోవిందుడి సొమ్ము కాజేసిన నీ పని గోవిందా..అని శ్రీవారి భక్తులు బాబుపై మండిపడుతున్నారు. మొత్తానికి ఢిల్లీలో వ్యక్తిగతంగా చేపట్టిన ధర్మపోరాట దీక్షకు చంద్రబాబు 4 కోట్ల దేవుడి సొమ్ము ఖర్చుపెట్టడం పట్ల ప్రజలు నోరెళ్లపడుతున్నారు. దేవుడిని కూడా నిలువుదోపిడీ చేసిన ఘనుడు చంద్రబాబు అని నెట్‌జన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.