టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వైరల్‌ఫీవర్‌తో బాధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 29న ఆయన జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారంనాడు కొందరు ఆయన్ను కలవాల్సి వున్నా ఆరోగ్యం సరిలేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిసింది. ‘మన్మథుడు2’ చిత్రంలో రకుల్ పక్కన నటించడం కోసం ఆయన కాస్త కసరత్తులు ఎక్కువగా చేసినట్లు సమాచారం. దాంతో కొంత డైటింగ్ కూడా కొంచం ఎక్కువగానే చేసినట్లు ఉన్నారు. ఆ మధ్య ఆ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నాగార్జున వచ్చినప్పుడు ఆయన చేతికి కూడా చిన్న కట్టు ఉంది. కొంత మంది విలేకరులు అడగగా ఆయన కొంచం జిమ్‌లో కసరత్తులు ఎక్కువగా చేయడం వల్ల కొంత నొప్పి రావడంతో అలా బ్యాండేజ్ కట్టడం జరిగిందని వివరించారు. దీంతో అక్కినేని నాగార్జున కాస్త అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. కంగారు పడాల్సిందే ఏమీ లేదు …చిన్న వైరల్ ఫీవర్ అని వైద్యులు చేప్పినట్లు తెలుస్తుంది.
