ఇటీవల కృష్ణానదికి వరద పోటెత్తడంతో చంద్రబాబు అక్రమ నివాసంతో పాటు…అమరావతిలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వరద సహాయక చర్యల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చురుకుగ్గా పాల్గొన్ని ప్రాణ నష్టం జరుగకుండా బాధితులకు తగిన సహాయక చర్యలు అందించారు. అయితే రైతు వేషంలో ఒక టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశాడు. అంతే కాదు మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు రైతు వేషంలో ఉన్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వీడియోలో మంత్రిపై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నారు.శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పెయిడ్ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు.ఇటీవల వరద సమయంలో రైతు వేషం కట్టి … తానే ఒక రైతును అని ప్రజలను నమ్మించడం ద్వారా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కలిగించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు ఈ శేఖర్ చౌదరి. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇక పోలీసుల విచారణలో తాము కుట్రలో భాగంగానే రైతు వేషం కట్టి ప్రభుత్వాన్ని తిట్టినట్టు అంగీకరించాడు. తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు పలువురిని టీడీపీ ఉపయోగిస్తున్నట్టు చెప్పాడని సమాచారం. వివిధ వర్గాల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులే ప్రభుత్వాన్ని తిట్టిపోసి… ఈ వీడియోలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు జరుగుతున్న కుట్రను అతడు బయటపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనేది పోయి…ఇలా ప్రభుత్వం చేసిన సహాయక చర్యలను విమర్శించేందుకు, గౌరవ మంత్రి పదవిలో ఉన్న అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషించే నీచానికి ఒడిగట్టిండి టీడీపీ. జగన్ సర్కార్‌కు ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక నారాలోకేష్ టీమ్…ఇలా పెయిడ్ ఆర్టిస్ట్‌లతో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేయడం పట్ల ప్రజల్లో అసహ్యభావాన్ని కలిగిస్తుంది. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు, లోకేష్‌లు మారలేదు అనడానికి ఈ పెయిడ్ ఆర్టిస్ట్ బాగోతం నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తంగా ఈ పెయిడ్ ఆర్టిస్ట్‌తో మంత్రి అనిల్‌కుమార్‌ను దూషించింది టీడీపీ సోషల్ మీడియానే అనేందుకు..పోలీసులు తగిన ఆధారాలు సేకరిస్తుండడంతో ఈ కేసు లోకేష్ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.