తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంపై సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ అభిమానులు ఓ రేంజ్‌లో వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్న వారిని పరిస్థితి ఎదురు తన్నింది. అసలు ఆ ప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి సంబంధమే లేదని తేలిపోయింది. ఈ ఘనకార్యం కూడా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. అయితే దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి చుక్కలు చూపించారు.మూడు నెలలకే ఇంత బట్టలు చించుకుంటే ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు బాబూ? తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక మైనారిటీలను జెరూసలేం, మక్కాకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను ముద్రించింది మీ హయాంలోనే కదా. ఏం ఎరగనట్టు అన్యమత ప్రచారమంటూ విద్వేశాలు రెచ్చగొడుతున్నారు. మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే అని గట్టిగా స్పందించారు.
మూడు నెలలకే ఇంత బట్టలు చించుకుంటే ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు బాబూ? తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక మైనారిటీలను జెరూసలేం, మక్కాకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను ముద్రించింది మీ హయాంలోనే కదా. ఏం ఎరగనట్టు అన్యమత ప్రచారమంటూ విద్వేశాలు రెచ్చగొడుతున్నారు. మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 24, 2019