తాజగా హైపర్ ఆది లేకపోవడంతో జబర్ధస్త్ పై అభిప్రాయాలు మారుతున్నాయి. ఉప్పు లేకపోతే కూర ఎలా రుచిగా ఉండదో ఆది లేకపోతే అలానే ఉంటుందంటున్నారు. తన కామెడీ పంచులతో టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ఆది షోలో కనిపించ్పోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. వెండితెరపై బ్రహ్మానందాన్ని చూడగానే ఎంత నవ్వొస్తుందో ఆదిని టీవీలో చూడగానే ఈసారి ఏం పంచులేస్తాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కడుపుబ్బా నవ్వించే ఆది పంచులంటే జడ్జ్ లకు కూడా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ వచ్చేది. అలాగే షోలోని పార్టిసిపెంట్లంతా ఎవరికీ ఎవరూ తక్కువ కాదు. ఎవరి కామెడీ వారిదే. అయినా ఆదీకి ఉన్న ఇమేజ్ వేరు. రైటర్ కూడా అయిన ఆదీకి సినిమా అవకాశాలూ తలుపు తడుతున్నాయి. ఇంతకీ ఈ వారం షోలో హైపర్ ఆదీ స్కిట్ ఎందుకు లేదంటే ప్రస్తుతం ఆయన టీమ్ అంతా విదేశీయానం చేస్తున్నారట.. అమెరికాతోపాటు పలు దేశాల్లో తెలుగు వాళ్లున్న చోట కొన్ని స్కిట్స్ చేయడానికి వెళ్లారట. అందుకే జబర్థస్త్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.