ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిస్సిగ్గుగా, మరీ లేకిగా ప్రభుత్వ కుర్చీలు, సోఫాలు, కంప్యూటర్లు ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లడం ఏంటి అని ఏపీ ప్రజలు మొత్తం దుమ్మెత్తి పోస్తున్నారు. మళ్లీ పోనీ తిరిగిచ్చేయాలని తెలిసినా మర్చిపోయానంటూ కబుర్లు చెప్పడమేంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. అయితే గత 4 రోజులుగా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కనీసం స్పందించలేదు. ట్విట్టర్ లో నారాలోకేష్ కి కనీసం కోడెలపై ఓ ట్వీట్ చేయడానికి మనసు రాలేదెందుకు అంటున్నారు. అంటే నారా లోకేష్ కాని ..టీడీపీ నేతలకు కాని ముందే తెలుసా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు కోడెల తరపున వకాల్తా పుచ్చుకోడానికి ఏ ఒక్క టీడీపీ నేత కూడా సిద్ధంగా లేరంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దొంగతనం జరిగిందనే విషయం వాస్తవం, దొంగే ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు, దీంతో ఇక సమర్థించడానికి టీడీపీకి కూడా అవకాశం లేకుండా పోయింది. అందుకే తెలియనట్టే ఉంటున్నారు టీడీపీ నేతలు. అంటే కోడెల చేసింది తప్పేనని చంద్రబాబు ఒప్పుకున్నట్టే. అందుకే ఆయన మౌనందాల్చారు. ఇక మిగిలింది ఏంటంటే.. ఆ కుటుంబాన్ని పార్టీ నుంచి దూరంగా పెట్టడం. కోడెల కొడుకు, కూతురు అవినీతి బాగోతం బైటపడ్డప్పటి నుంచీ ఆ కుటుంబాన్ని టీడీపీ వదిలించుకోవాలని చూస్తోంది. కోడెల కూతురు, కొడుకు ఇద్దరిపై పార్టీ వేటు వేస్తోందనే వార్తలొచ్చినా అవి జరగలేదు. తీరా ఇప్పుడు దొంగతనం వ్యవహారం బైటపడటంతో.. కోడెలకు టీడీపీ పార్టీ షాక్ ఇవ్వబోతుంది అని ప్రచారం సాగుతుంది.
