బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే జైట్లీ మృతికి తెలంగాణా సీఎం కేసిఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఇంక తన జీవితంలోకి ఒక్కసారి వెళ్తే జైట్లీ న్యాయవాదిగా పనిచేసినప్పుడు ప్రత్యర్ధులకు చెమటలు పట్టించేవారట. ఎవరైనా సరే అతడి ముందు ఓటమి ఒప్పుకోవాల్సిందేనట. అలాంటి వ్యక్తి తన ఇంటి సిబ్బంది విషయానికి వచ్చేసరికి మాత్రం మానవత్వాన్ని చాటుకున్నాడు. సిబ్బంది పిల్లల చదువుకు సంబంధించి ఆర్ధికంగా ఆయనే చూసుకునేవారు. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారి పిల్లల పెళ్ళిళ్ళు కూడా స్వయంగా తన చేతులు మీదగా తన ఇంటిదగ్గరే చేయడం మామోలు విషయం కాదు. దీనిబట్టే అర్ధం చేసుకోవాలి వృత్తి పరంగా ఎలా ఉన్న బయట మాత్రం మానవత్వం చాటుకున్నారు జైట్లీ.
