Home / ANDHRAPRADESH / లోకేశ్…ఇంట్లో కూర్చుంటే బెటర్.. టీడీపీ అభిమానుల ఫైర్…!

లోకేశ్…ఇంట్లో కూర్చుంటే బెటర్.. టీడీపీ అభిమానుల ఫైర్…!

ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు గారి పుత్రరత్నం నారాలోకేశం..మాట్లాడినా..ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసినా అడ్డంగా దొరికిపోతున్నాడు..మొన్నటికి మొన్న మా నాన్నారి ఇంటిని ముంచేయడానికి వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీకి పడవ అడ్డం పెట్టి వరద నీటిని దారి మళ్లించారని ఫోటోతో సహా చేసిన పోస్ట్‌ పెట్టిన లోకేశాన్ని నెట్‌జన్లు చెడుగుడు ఆడుకున్నారు. ఎక్కడైనా బ్యారేజీ గేట్లకు చిన్నపడవను అడ్డం పెట్టి వరదనీటిని దారి మళ్లించవచ్చా…నువ్వెక్కడి మాలోకం సామి అంటూ నెట్‌జన్లు లోకేష్‌పై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. తాజాగా ప్రభాస్ నటించిన సాహో చిత్రంపై లోకేష్ పెట్టిన ట్వీట్‌ బూమరాంగ్ అయింది. ప్రత్యర్థి పార్టీల అభిమానులు కాకుండా సొంత పార్టీ అభిమానులే లోకేష్‌ ట్వీట్‌పై నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…సాహో ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళుతుందని..జగన్ రియల్ పొలిటికల్ బాహబలి అంటూ ప్రభాస్ కామెంట్ చేశారు. దీంతో టీడీపీ అభిమానులు సాహో మూవీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ మొదలుపెట్టారు. టీడీపీ అనుకూల వెబ్‌సైట్లు కూడా సాహోపై నెగెటివ్ ప్రచారం మొదలెట్టాయి. దీంతో ఎక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ తమకు వ్యతిరేకం అవుతారనే భయంతో లోకేష్..సాహో మూవీని టీడీపీ అభిమానులంతా చూడాలని, సిన్మాను హిట్ చేయాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నెట్‌జన్లు లోకేష్ ట్వీట్‌పై మండిపడ్డారు.

ప్రభాస్ జగన్‌ని పొగిడితే అతడి మద్దతుగా ఎలా ట్వీట్ చేస్తావంటూ టీడీపీ సోషల్ మీడియా అభిమానులు లోకేష్‌పై విరుచుకుపడ్డారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మీ నాన్నారిపై చేసిన వ్యాఖ్యలను మర్చిపోయావా అంటూ లోకేష్‌ను ప్రశ్నిస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ సందర్భంలో కృష్ణంరాజు టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక టీడీపీ మూతబడిపోతుందని, చంద్రబాబు ఒక చచ్చిన పాము అని కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మరిచిపోయావా లోకేష్ అంటూ టీడీపీ పార్టీ అభిమానులు నిలదీస్తున్నారు. నువ్వు, మీ మామ బాలయ్య రాజకీయాలకు పనికిరారు…శుభ్రంగా తిని ఇంట్లో కూర్చో అంటూ టీడీపీ నెట్‌జన్లు తీవ్ర పదజాలంతో లోకేష్‌ను చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ప్రభాస్‌ అభిమానులు ఎక్కడ దూరం అవుతారో అన్న భయంతో లోకేష్ చేసిన చిన్న ట్వీట్ ఆఖరికి పార్టీ అభిమానులే ఛీత్కరించేలా చేసింది. పాపం లోకేష్..ఇంట్లో తిని తొంగుంటేనే బెటరేమో అని తెలుగు తమ్ముళ్లు కూడా తెగ సైటైర్లు వేసుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat