గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త విన్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి చెందారు. అరుణ్‌జైట్లీ గారి మరణం అత్యంత విషాదకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. జైట్లీ గారు అత్యంత స్ఫూర్తిదాయక వ్యక్తి. వ్యక్తిగతంగానూ, రాజకీయంగా ఆయన మచ్చలేని మహారాజుగా జీవించారని, నాకు కూడా అతనితో చాలాసార్లు కలిసే అవకాశం రావడం అదృష్టమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Extremely saddened to learn about the demise of Former Union Minister Sri @arunjaitley Ji. Condolences to his family ?
One of the most well informed & composed union ministers I’ve had the good fortune of interacting many times. Always forthright & ebullient#RIPJaitleyJi pic.twitter.com/G4z3isLlVz
— KTR (@KTRTRS) August 24, 2019