కేఫ్ కాఫీ డే అనే మూడు అక్షరాలతో కట్టిపడేసిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తన పరుగును ఒక్కక్షణంలో ముగించడంతో తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సునీల్ ధవళ ఒకరు ఆయన గురించి ఇలా వ్యాఖ్యానించారు. యావత్ భారతదేశాన్ని కంటతడి పెట్టించిందనడంలో సందేహం లేదు. అందరినీ కలుపుకొని అందమైన జీవితాన్ని నిర్మించుకున్న ఆయన.. ఎందుకు అంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారో దేశ ప్రజల మెదళ్లను ఇంకా తొలుస్తూనే ఉంది తాజాగా ఆత్మహత్య చేసుకుని అందరినీ కంటతడి పెట్టించి జీవిత పరమార్థాన్ని నింపుకున్న కార్యసాధకుడు, అలు పెరుగని సాధకుడు ఓ సామాన్యుడిగా తన జీవిత పోరాటాన్ని ప్రారంభించి శిఖర సామ్రాజ్యాన్ని సాకారం చేసుకున్నారు. కాఫీపై మీగడ నవ్వినట్టు అలిసిపోయిన మనసును అక్కున చేర్చుకున్నట్టుగా ఆయన అందరి మనసులకూ దగ్గరయ్యారు.
