తమిళనాడులో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో ఏపీ పోలీసులు అప్రమత్తమైయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతర తనిఖీలు చేస్తూ సీసీ కెమెరాలతో పరిశీలన చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
