కేంద్ర మాజీ హోంమంత్రి, యుపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన చిదంబరం ఇప్పుడు ఏఎన్ఎక్స్ స్కామ్‌లో కటకటాల పాలయ్యారు. నిజానికి యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చిదంబరం చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు..యుపీఏ సర్కార్ విధానాలను ప్రశ్నించే రాజకీయ ప్రత్యర్థులు, స్వామిజీలపై అన్యాయం కేసులు పెట్టించి జైలు పాలుచేయడంలో చిదంబరం కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జగద్గురువులు కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా స్వామి వారిని అన్యాయంగా అరెస్టు చేయటంలో అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్య పాత్ర పోషించారు… ఇప్పుడు ఆ పాపమే చిదంబరంకు చుట్టుకుంది. అంతే కాదు ఇప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాపై తప్పుడు కేసులు పెట్టి..ఆయన్ని జైల్లో పెట్టించాడు. అప్పుడు కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షాను అరెస్ట్ చేయిస్తే….ఇప్పుడు అదే అమిత్‌షా కేంద్ర హోంమంత్రి అయి చిదంబరంను అరెస్ట్ చేయించాడు..దీన్నే ప్రారబ్ద కమ్మ అంటారు. మనిషి చేసిన కర్మ కూడా వాడిని అలా వెంటాడి కబళిస్తుంది. జగద్గురువులు జయేంద్ర సరస్వతి స్వామిని అన్యాయంగా అరెస్టు చేసిన పాపం కూడా ఊరికే పోకుండా అలా చేసిన వాళ్లలో ప్రతి ఒక్కరిని కబళిస్తోంది, కబళించబోతోంది కూడా…..జయేంద్ర సరస్వతిని అరెస్ట్ చేయించి జయలలిత అక్రమాస్థుల కేసులో జైలు శిక్ష అనుభవించింది…ఇక సోనియాగాంధీ…నేషనల్ హెరాల్డ్ కేసులో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఇక చిదంబరం ఐఎన్‌ఎక్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. అందుకే అంటారు…ప్రారబ్ద కర్మ అనేది ఒకటి ఉంటుందని…అది ఎవరు చేసిన కర్మ చివరకు వారినే వెంటాడి కబళిస్తుంది. .ప్రారబ్ద కర్మకు ఉదాహరణే…జయలలిత, సోనియాగాంధీ, చిదంబరంల పతనం.
