తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో తను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా మీడియాతో మాట్లాడుతూ” తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.
పార్టీ మారుతున్నట్లుగా కొందరు పనికట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఇతర పార్టీల వారిని ఎవరినీ కలవడంలేదని, హైదరాబాద్లోనే ఉన్నానని అన్నారు. అయితే తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.