ఒక్క 10 రోజులు నాయకుడు పర్సనల్ పనుల మీద రాష్ట్రంలో అందుబాటులో లేకపోతే పరిస్థితులు మ్యానేజ్ చేసుకోలేక దిక్కులు చూసే స్థితిలో మన పార్టీ ఉందా.. ఇది సగటు వైసీపీ అభిమాని ప్రశ్న.. తాజాగా జరిగిన ఘటనలపై టీడీపీ పెద్దఎత్తున ఆర్భాటం చేస్తుంటే ఓ ముగ్గురు మంత్రులు తప్ప కనీసం కిమ్మనే నాధుడే లేడు.. మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబును చంపేందుకే డ్రోన్ తిప్పారంటూ అసత్య ప్రచారం చేసారు.. రాజధానిని ముంచేందుకే వరదలు సృష్టించారంటూ దుష్ప్రచారం చేసారు.. పెయిడ్ ఆర్టిస్టులతో ముఖ్యమంత్రినే దుర్భాషలాడించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగుతుందంటూ మతాల మధ్య చిచ్చు రేపారు. అయినా కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనంపై ఎవరూ మాత్రం నోరు మెదపరు.. వరదలపై పవర్ లెస్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అయినా ఎమ్మెల్యేలెవరూ రోడ్డు మీదకు రాలేదు. ఎక్కడా కనీసం ఖండించలేదు.. మొత్తం 9ఏళ్లు పార్టీ నాయకుడు రోడ్డు మీద పడి తిరిగి 150 మంది ఎమ్మెల్యేలని 22మంది ఎంపీలుగా గెలిపిస్తే ఆయన లేనిసమయంలో టీడీపీ, బీజేపీ ఆరోపణలు చేస్తుంటే ఆ ముగ్గురు నలుగురు మంత్రుల తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించలేదు దీనిపైనే పార్టీ శరేణులు ఆగ్రహిస్తున్నారు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోడానికి కాదు గెల్పించింది. మీడియా కవరేజ్ లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడాలంటూ హితవు పలుకుతున్నారు. పార్టీ గుర్తు పైన జగన్ చరిష్మాతో గెలిచిన మీరు ఇంట్లో కూర్చోడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇస్తున్నారు.
