కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమన్నారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసిన సేవలు చిరస్మరణీయం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆయన మృతి బీజేపీ కే కాకుండా మొత్తం దేశానికే తీరనిలోటు. అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధిస్తున్నాను అని చంద్రబాబు తెలిపారు.
