ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో చోటు చేసుకున్న పరిణామాలతో ఎవరూ ఊహించని విధంగా షాకిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్ జట్టు తరపున ఆడుతోన్న రాయుడు… ఈ సందర్భంగా టీమిండియా తరుఫున టీ-20 మ్యాచ్‌ల్లో ఆడాలని భావిస్తున్నట్టు తన మనసులోని మాట బయటపెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో తిరిగి అడుగుపెట్టాలన్న ఆలోచన తనకు ఉందని రాయుడు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయుడు మళ్లీ కొత్త నిర్ణయంతో షాకిస్తున్నాడు.
