తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడాన్ని ఇప్పటికే సిఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని అన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలో వైఎస్సార్ జీవో జారీ చేసారని, వైఎస్ జారీ చేసిన జీవోను ముఖ్యమంత్రి తక్షణం సమీక్షించాలి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.