తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీసీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు ఎక్కువ వదలడం వల్లే లంక గ్రామాల్లో పంటలన్నీ ద్వెబ్బతిన్నాయన్నారు. 3రోజులు రెండున్నర లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేసి ఉంటే విపత్తు అనే మాటే ఉత్పన్నం కాదన్నారు. ఇది పూర్తిగా మానవ తప్పిదం తో ఏర్పడిన విపత్తు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని ముంచాలనే కుట్రతో ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ప్రకాశం బ్యారేజీ కి ఒక్కసారిగా నీరువస్తే తన ఇల్లు మునుగుతుందనే కుట్రతో వ్యవహరించారన్నారు. మంత్రులు తన ఇంటి చుట్టూనే తిరిగారన్నారు. తాను లేని సమయంలో ఇంటికి నోతీసులు అంటించారున్నారు. అయితే చంద్రబాబు తాను నదిలో ఇల్లు కట్టుకోవడం తప్పని మాత్రం ఒప్పుకోలేదు. అలాగే పైగా వచ్చిన నీటిని వదిలేయాలని ఏమాత్రం స్టోర్ చేయొద్దంటూ సలహాలిచ్చారు. అయితే గతంలో తాను సముద్రాన్ని కంట్రోల్ చేసానని, అధికారులు ఎండలను అదుపు చేయాలని చెప్పినట్టుగా ఇప్పుడు వరదలు కూడా మునుషులు తెచ్చారని చెప్పడంపై సదరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొన్న టీడీపీ నేతలకే దిమ్మతిరిగిందట.
