తాజాగా రోబో 2.O సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 1996 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడది జనవరిలోనే షూటింగ్ మొదలైనా రెండు మూడు నెలల్లోనే బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చి సినిమా ఆగిపోయింది. దాదాపుగా ఏడునెలలపాటు హోల్డ్ లో ఉన్న ఈప్రాజెక్ట్ షూటింగ్ మళ్లీ ఈమధ్య మొదలైంది. అయితే ఈసినిమా కోసం కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసారు చిత్ర యూనిట్. కానీ ఐశ్వర్య రాజేష్ దర్శకనిర్మాతలకు చిత్ర బృందానికి షాకిస్తూ ఆఖరి నిమిషంలో సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సినిమా షూటింగ్ మరోసారి వాయిదాపడింది. డేట్స్ కుదరక పోవడం వల్లే స్వయంగా ఈసినిమా నుంచి తాను తప్పుకున్నట్లు ఐశ్వర్య మీడియాతో చెప్పింది. కమల్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రకుల్ ప్రీత్, సిద్ధార్థ్ తదితరులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈసినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
