తమ పార్టీపై సోషల్ మీడియాలో అధికారంలో ఉన్న వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
* వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లీగల్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న జనసేన పార్టీ. pic.twitter.com/QKhg0Cc4UB
— JanaSena Party (@JanaSenaParty) August 23, 2019