వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం ముందు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీలో తీవ్ర కష్టాల్లో పడిపోయింది. కేవలం 23 మంది గెలిచిన టీడీపీ 2024 ఎన్నికలకు ఆ 23 మంది ఉంటరా లేక ఇతర పార్టీలోకి చేరుతారో అని అయోమయం లో పడింది. ఫ్యాన్ గాలికి గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఇటీవల ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరికొంత మంది వైసీపీ చూస్తున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 13 మంది కీలక నేతలతో సహా పలువురు కాకినాడలోని సిటీ ఇన్ హోటల్‌లో రహస్య సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఓసారి గమనిస్తే.. తమ పార్టీ అధికారంలో ఉండగా చేసిన తప్పులు ఎక్కడ చుట్టుకుంటాయోనని ఆత్మరక్షణలో పడిన నేతలు..రక్షణ ఇచ్చే షెల్టర్ వెతుక్కునే పనిలో పడ్డారంట. త్వరలో ఆ మాజీ ఎమ్మెల్యేలంతా వైసీపీలోకి కొందరు..బీజేపీలోకి కొందరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. తనకు సన్నిహితులు, వ్యాపార భాగస్వామ్యులు, బినామీలను వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపించిన చంద్రబాబు ఆ విషయాన్ని తమకు చెప్పకుండా రహస్యంగా దాచి ఉంచడమేమిటని ఆ పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట.
