ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. మొదటి మ్యాచ్ గురువారం మొదలైంది. అయితే ముందుగా టాస్ గెలిచిన కరేబియన్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. అందరు ముందుగా అనుకునట్టుగానే భారత్ మంచి ఫామ్ లో ఉండడంతో వెస్టిండీస్ కు కష్టమైన పరిస్థితి అని అందరు అనుకున్నారు. కాని అందరి అంచనాలను తలకిందులు చేసి భారత్ నీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. వాళ్ళ బౌలింగ్ దెబ్బకు అగర్వాల్, పుజారా, కెప్టెన్ కోహ్లి చేతులెత్తేశారు. దీంతో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన రహనేతో కలిసి ఓపెనర్ రాహుల్ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డాడు. కాసేపటికే 44 పరుగుల వద్ద రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. దాంతో మొత్తం బాధ్యతను రహానే తీసుకుని స్కోర్ ను ముందుకు నడిపించాడు. దీంతో ఒక్కసారిగా భారత్ ఊపిరి పీల్చుకుంది.
