తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ సోమశేఖర చౌదరి మరోసారి సోషల్ మీడియా ముందుకు వచ్చారు. తాజాగా వైసీపీ నేతలే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు సంబంధం లేని వీడియోలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చౌదరి ఓ తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారా మాట్లాడాడు. గుంటూరులోని తన పొలాలు ముగినిపోయాయని అధికారులకు చెప్పేందుకే వీడియో పోస్టు చేసినట్టు చెప్పాడు. పైగా ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్తూనే ఆ స్థానంలో ఎవరు ఉన్నా తాను అలాగే రియాక్ట్ అయ్యేవాడినని చెప్పాడు.. పైగా వైసీపీనేతలు తనను వేధించడం మాని, వరద బాధిత రైతులకు సాయం చేయాలని సదరు ఆర్టిస్టు హితవు పలికాడు.. తెలుగుదేశానికి మద్దతు పలుకుతూ వీడియోలు చేస్తూనే, సీఎంను అనుచితంగా దుర్భాషలాడుతూనే తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని సోమశేఖర చౌదరి చెప్తున్నాడు. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఇతనిపై మండిపడుతోంది. గతంలో కనీసం సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క పోస్ట్ పెట్టినా అరెస్ట్ లు చేసేవారని, ఇతను ముఖ్యమంత్రిని బూతులు తిట్టినా అరెస్ట్ చేయరెందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇతనిని అరెస్ట్ చేయకపోవడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనంటున్నారు.
Home / ANDHRAPRADESH / గతంలో చంద్రబాబును ఒక్క మాటంటే అరెస్ట్ చేసేవాళ్లు.. సీఎంని, మంత్రి కులాన్ని తిడితే వదిలేస్తారా.?
Tags Chandrababu cm media paided artist soma sekhar chowdary tdp ysrcp