Home / ANDHRAPRADESH / జగన మార్క్ పాలన ప్రారంభం.. త్వరలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు

జగన మార్క్ పాలన ప్రారంభం.. త్వరలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారిస్తూ అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. దీనికోసం ఇప్పటికే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాంతీయ బోర్డుల పరిధిలో గల జిల్లాలన్నీ అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

1.విజయనగరం జిల్లా కేంద్రంగా (శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్టణం)
ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

2. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ప్రాంతీయ ప్రణాళిక బోర్డు..

3.గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు..

4. కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు.

మరోవైపు కేబినెట్‌ ర్యాంకులతో చైర్మన్ల నియామకం చేపడుతున్నారు. ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు కేబినెట్‌ స్థాయి ర్యాంకులో మూడేళ్ల కాల వ్యవధికి చైర్మన్‌ నియామకం ఇస్తూ.. వ్యవసాయం (ఫుడ్‌ ప్రాసెసింగ్‌–అగ్రి మార్కెటింగ్‌) నీటి నిర్వహణ, ఆర్థిక వృద్ధి – మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి – సంక్షేమ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను సభ్యులుగా నియమిచనున్నారు. వారికి అవసరమైన సిబ్బందిని కూడా ఇస్తారు. ఈ నేపధ్యంలో ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల ఏర్పాటు చేయడనుండడంతో రాష్ట్ర ప్రణాళికా మండలిని రద్దు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

విధివిధానాలు ఇలా ఉన్నాయి..

*ఏయే ప్రాంతాల్లోని ఏ రంగాల్లో జనాభాపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందో గుర్తించాలి.

*ప్రాంతీయ, జిల్లా అభివృద్ధి నివేదికలను రూపొందించడంతో పాటు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి.
*ప్రాంతీయాభివృద్ధికి ఏస్థాయిలో నిధులు ఖర్చు చేయాలో అంచనావేసి ప్రభుత్వానికి సూచనలివ్వాలి.
*అభివృద్ధి కార్యక్రమాలను అంచనా వేస్తూ.. ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి కృషిచేయాలి. మొత్తం ప్రాంతం సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
*జిల్లా సమీక్షా కమిటీల సమావేశాలకు ప్రాంతీయ ప్రణాళిక బోర్డు చైర్మన్లు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్తారు.
*వ్యవసాయ ఉత్పత్తుల ప్రణాళికను రూపొందించడంతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహించి రైతుల పంటలకు సరైన ధర కల్పించాలి.

సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి మాస్టర్‌ ప్రణాళికను రూపొందించడంతోపాటు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. తగిన పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
ఆర్థిక వనరులు, మౌలిక వసతుల ప్రణాళికలను రూపొందించాలి. రాష్ట్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి. మౌలిక సదుపాయాల వ్యత్యాసాలను పూరించడంతో పాటు స్థానిక సహజ వనరుల ద్వారా జిల్లాలను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.సామాజిక మౌలిక సదుపాయాలు,సంక్షేమ రంగాలకు ప్రణాళికలను రూపొందించాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడంతో పాటు ఉపాధి హామీ, ఆర్‌ఐడీఎఫ్‌ నిధులతో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రవాణా రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat