తాజాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు వరుస తప్పుడు కథనాలు, సన్నివేశాలతో, తప్పుడు వీడియోలతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెయిడ్ ఆర్టిస్టుల వెనుక ఎవరున్నారో తేల్చాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కోరారు. టీడీపీకి చెందిన జూనియర్ పెయిడ్ ఆర్టిస్ట్ ల విషయంలో చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. అలాగే వారంతా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి అసభ్యంగా మాట్లాడుతుండడం, నీటిపారుదల శాఖామంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ కులాన్ని దూషించడంపై ఫిర్యాదు చేసారు. గతంలో సదరు ఆర్టిస్ట్ కుడితిపూడి శేఖర్‌చౌదరి చేసిన వీడియో పై ఫిర్యాదుచేశారు. మరో 3రోజుల్లో పెయిడ్ ఆర్టిస్టును అరెస్ట్ చేసి దీని వెనుక ఎవరున్నారో వివరాలన్నీ బయటకు తీస్తామని డీజీపీ సవాంగ్ అన్నారు. అయితే సీఎం వైయస్ జగన్, అనిల్‌కుమార్ యాదవ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శేఖర్ చౌదరిపై వైయస్‌ఆర్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు కూడా ఫిర్యాదు చేసారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో ఇలా పెయిడ్ ఆర్టిస్ట్ దుర్భాషలాడిన అంశాన్ని సీరియస్ గా తీసుకుని పెద్దఎత్తున ఫిర్యాదు చేయడంతో డైనమిక్ ఆఫీసర్ అయిన గౌతమ్ సవాంగ్ వారి తాట తీసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
Home / ANDHRAPRADESH / సీఎం జగన్, మంత్రి అనిల్ ను దుర్భాషలాడడంతో సీరియస్ గా తీసుకుని పెద్దఎత్తున ఫిర్యాదులు చేసిన వైసీపీ
Tags ap Chandrababu gowtham sawang jagan paid artists tdp warning ysrcp