ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గత కొద్దిరోజులుగా చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని ఇండియాకు చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7గంటలకు ముఖ్యమంత్రి జగన్ అమెరికాలోని చికాగోనుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. శనివారం ఉందయం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈనెల 15న అమెరికా బయలుదేరిన జగన్ వారంరోజులపాటు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే సీఎం జగన్ అమెరికా పర్యటనకు మంచి స్పందన వచ్చింది. ఎక్కడకు వెళ్లినా తెలుగుప్రజలు బ్రహ్మరధం పట్టారు. జేజేలు పలికారు. ముఖ్యంగా డల్లాస్ లో ని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశం సక్సెస్ అయ్యింది. ఈవెంట్ మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అనంతరం జరిగిన పలు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ప్రవాసాంధ్రులు కూడా రాష్ట్రాభివృద్ధికి ముందుకు రావాలని జగన్ కోరారు.
