తాజాగా ఏపీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగిందట.. ఈ ఘటనలో దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్ తెలిపారు. అయితే కరెంటు పనిచేయాలని ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని వాచ్ మెన్ చెప్పారు. అసెంబ్లీ నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొరి అంగీకరించిన నేపథ్యంలోనే ఈచోరీ జరగడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే మరో నాటకానికి తెర తీసినట్టు స్పష్టమవుతోంది. అలాగే కోడెల ఇంట్లోని ఫర్నీచర్ పరిశీలించేందుకు అసెంబ్లీ అధికారులు రాబోతున్న సమయంలోనే దొంగతనం జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అలాగే కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారనే అనుమానాలు చెలరేగుతున్నాయి. ఆ దుండగులు పడేసిన కంప్యూటర్ మానిటర్‌ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలు మాత్రం దుండగులు ఎత్తుకెళ్లారట.. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. అసెంబ్లీ నుంచి విలువైన వస్తువులను సత్తెనపల్లిలోని ఇంటికి తెచ్చుకున్న కోడెల తన తప్పును ఒప్పుకున్నారు. ఆవస్తువులన్నీ తిరిగిస్తానని, లేదంటే ఆ ఫర్నీచర్ ధర ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానన్నారు. ప్రస్తుతం కోడెల కక్కుర్తిపై ప్రభుత్వాధికారులు విచారణ చేపట్టారు.అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నువ్వు ఫర్నీచర్ ను దొబ్బేయడం ఏంటయ్యా అని అందరూ కోడెలని ప్రశ్నిస్తున్నారు.
