తెలంగాణలో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలకు చేరుకుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇవాళ్టితో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తయిందని కేటీఆర్ చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్ ఇవాళ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భారీగా సభ్యత్వాల నమోదుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో గజ్వేల్, వర్ధన్నపేట ముందు వరుసలో నిలిచాయి.
దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలి. ఈ నెల చివరి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి. రాష్ట్రంలో బీజేపీకి 12 లక్షల సభ్యత్వాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కంటే బలమైన పార్టీ ఏదీ లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.