తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజెపి జాతీయాధ్యక్షుడి హోదాలో తిరుపతిలోని అలిపిరి వద్ద జరిగిన దాడి ఘటన మరోసారి చర్చకు వచ్చింది.. గతంలో తిరుమలకు వచ్చిన అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమిత్ షా కాన్వాయ్ వద్ద ఆందోళనకు దిగారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధమైన టీఎన్ ఎస్‌ఎఫ్ నాయకుడు సుబ్రమణ్యం యాదవ్‌ను అలిపిరి పోలీసులు అరెస్టు చేసారు. అయితే అమిత్‌షాపై దాడికి పాల్పడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అయితే ఈ దాడి చంద్రబాబే చేయించారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ఎందుకంటే తెలుగుప్రజలకు కేంద్రంపై కోపం ఉందని తెలియచేయడంలో భాగంగా ఈ దాడికి పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబే స్వయంగా ఈ దాడి చేయించారంటూ వాళ్లు ఆరోపణలు కూడా చేశారు. అయితే తాజాగా చిదంబరం అరెస్ట్ తో చంద్రబాబు చేసిన పాపాలు కూడా పండాయంటూ వైసీపీ సోషల్ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మిమ్మల్ని, జగన్ అన్న ని అరస్ట్ చేసిన వాడినే అరెస్ట్ చేశారని మీకు థాంక్యూ అని చెబుతూనే మీమీద రాళ్ళు వేసిన వారిని, మా సీఎంను అన్యాయంగా ఇరికించిన వాడిని, ప్రధాని మోడీని దారుణంగా తిట్టిన వారిని వదిలిపెడతారా అంటూ అమిత్ షాకి సందేశాలు పంపుతున్నారట.