మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఇది. పుట్టుక నుంచి చావు దాకా కులం కులం అంటూ గొంతు చించుకునే అగ్రవర్ణాల పైత్యం మరోసారి బయటపడింది. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలు నిరాకరించడంతో మరోదారిలేక వంతెన పై నుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లా వనియంపాడికి చెందిన ఎన్.కుప్పమ్ (46) అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. అయితే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తమ పొలం నుంచి శవాన్ని తీసుకెళ్లేందుకు అగ్రవర్ణాల వారు అంగీకరించలేదు. పురాతనమైన ఆది ద్రావిడర్ శ్మశాన వాటికకు ఈ పంట పొలాల నుంచే వెళ్లాల్సి ఉంటుంది. పొలాల యజమానులు అనుమతించకపోవడంతో సమీపలోని వంతెన కింద నుంచి మృతదేహాన్ని తరలించారు. ఇందుకోసం కుటుంబసభ్యులు ఆ మృతదేహాన్ని 20 అడుగుల ఎత్తు నుంచి వంతెన కిందకు తాళ్ల సాయంతో జారవిడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Shocking Video: Body of 46-year-old Dalit lowered from 20-feet high bridge after ‘upper caste’ disallowed procession to pass #vellore pic.twitter.com/mjbFOUDDCz
— Sidhant Mamtany (@SMamtany) August 22, 2019