ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీ విధించింది. 3 గంటల విచారణ తర్వాత సీబీఐ చిదంబరంను కోర్టులో హాజరుపర్చింది. చిదంబరాన్ని 5 రోజులు కస్టడీకి అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు చిదంబరాన్ని కస్టడీకి అనుమతించింది. మరోవైపు విచారణ సమయంలో అరగంటపాటు కుటుంబసభ్యులు, న్యాయవాదులతో మాట్లాడేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది.
