ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పైన బురద చల్లేందుకు టీడీపీ కొత్త ఎత్తుగడలు వేస్తోందంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో కొత్త వీడియోలు పోస్ట్ చేసారు. అందులో వరద బాధితుల రూపంలో నాడు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచార ప్రకటనల కోసం నటించిన పెయిడ్ ఆర్టిస్టులంటూ వారి తీరును బయట పెడుతున్నారు. ఇదే సమయంలో ఒటమీ జీర్ణించుకోలేని తెలుగుదేశంపార్టీ ఇలాంటి చర్యలను ప్రోత్సాహించడం సిగ్గుచేటు..రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీవ్రమైన పదజాలంతో ధూషించడంపై వైసీపీ అభిమానలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయించేందుకు ఈ రకంగా టీడీపీ వ్యవహరిస్తోందంటూ వైసీపీ శ్రేణులు ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దాని ప్రకారం టీడీపీ పేయిడ్ ఆర్టిస్టులు వరద బాధితుల ముసుగులో ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ కొన్ని ప్రకటనలను పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చిత్రీకరించింది. వాటిని టీవీ ఛానళ్ల ద్వారా ప్రచారం చేసారు. అందులో అప్పుడు టీడీపీ ప్రకటనల కోసం నటించిన పెయిడ్ ఆర్టిస్టులే ఇప్పుడు పలు ప్రాంతాల్లో వరద బాధితుల రూపంలో ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి..వైసీపీ పాలన పైనే వారు ఎక్కువగా ఆరోపణలు చేసారు. తమక ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందటం లేదన్నది వారి వ్యాఖ్యల సారాంశం. అయితే, వైసీపీ శ్రేణులు వీరి గురించి ఆసక్తి కర విషయాలను బయటకు తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖా మంత్రిగా గొర్రెలు కాచుకొనే అనిత్ యాదవ్..అంటూనే అనుచిత వ్యాఖ్మలను మరిన్ని చేసారు. దీంతో..సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. చివరకు వరద సహాయ చర్యల్లో వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారంటూ వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.
