విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గీతాగోవిందం తరువాత వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని చివరికి ఈ చిత్రం ఆవేరేజ్ టాక్ తో ముగిసింది. ఇక చాలా రోజులనుండి బ్లాక్ బ్లాస్టర్ కోసం ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో ఒక్కసారిగా మునుపటి వైభవానికి వచ్చేసాడు. దీంతో ఇప్పుడు పూరితో సినిమాలు తియ్యాలని హీరోలు ముందుకొస్తున్నారట. అయితే పూరి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు కూడా ఛార్మి నిర్మాతగా వ్యవరిస్తుంది. అయితే ఇప్పుడు వీరందరి చూపు టైటిల్ పైనే ఉంది. విజయ్, పూరి కాంబినేషన్లో సినిమా అంటే అందరు ఒక రేంజ్ లో ఉహించుకుంటారు.