ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ఆవిర్భావం నుంచి వాసిరెడ్డి పద్మ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించినట్లు తెలుస్తుంది. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయిన విషయం తెలిసిందే.
