వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ సీఎం అయ్యి ఇప్పటివరకూ పట్టుమని మూడు నెలలు కూడా గడవలేదు.. అయినా అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వేగంగా ముందడుగు వేసారు. ఫించన్లు, చట్ట సవరణలు, నిధుల మంజూరు విషయాల్లో జగన్ వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు టీడీపీ ఇంకా పాలన కుదుట పడకుండానే, సీఎం అన్ని డిపార్ట్ మెంట్ లపై అధ్యయనం చేయకుండానే విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఏకంగా కొందరు జగన్ సీఎంగా అనర్హుడంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో జగన్ తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాల్లో కొన్ని ఇవి..
1. వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నెలకు 2250/- పెన్షన్
2. వికలాంగులకు 3000/- పెన్షన్
3. డయాలసిస్ పేషెంట్స్ కు 10, 000/- పెన్షన్
4. రైతులు కు 9 గంటలు ఉచిత విద్యుత్
5. ఆక్వా రైతులు కు రూ. 1.50 లకే విద్యుత్
6. ఆశా వర్కర్స్ కు 10, 000/- జీతం పెంపు
7. ప్రజల్ని పీడించిన జన్మభూమి కమిటీల రద్దు
8. పారిశుధ్య కార్మికులు కు 18,000/- జీతం పెంపు
9. sc లకు 200యూనిట్ల వరకు ఉచిత కరెంటు
10. 75% స్థానికులు కు ఉద్యోగ కల్పన చట్టం
11. Sc,St,Bc లకు నామినేటెడ్ పదవుల్లో 50% వచ్చేలా చట్టం
12. మంత్రి పదవుల్లో 60% వెనుకబడిన వర్గాలకు చోటు
13. palm oil procurement కోసం palm రేటు పెంచుతూ GO జారీ
14. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ కమిటీ
15. ప్రతీ కలెక్టర్ నెలలో ఒక రోజు sc, st, bc హాస్టళ్లలో నిద్ర
16. అగ్రిగోల్డ్ భాదితులకు 1150/- కోట్లు కేటాయంపు
17. పోలీస్ లకు వీక్లీ ఆఫ్
18. దాదాపు 4 లక్షల వాలంటీర్ల నియామకం
19. దాదాపు 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు (సచివాలయం)
20. పాల ధర 4/-రూపాయలు సబ్సిడీ
21. YSR నవోదయం: SME ల పునరుద్ధణ కొరకు 400 కోట్లు కేటాయింపు
22. పేకాట, కోడి పందాలు, బెట్టింగ్ లపై ఉక్కుపాదం
23. జ్యూడిషరీ ప్రివిలైజ్ యాక్ట్
24. ప్రాజెక్ట్ లలో reverse టెండరింగ్ ద్వారా పారదర్సకత
25. సీఎం గా నెలకు 1/- జీతం
26. క్రొత్తగా మున్సిపాలిటీ లు ఏర్పాటు
27. ఒక్క రూపాయి లంచం లేకుండా లక్షల transfers
28. అక్టోబర్ 15న “రైతు భరోసా”, డిసెంబర్ 21న “ysr హెల్త్ కార్డ్స్”, జనవరి 26న “అమ్మ ఓడి
29. పొరుగు రాష్ట్రం తెలంగాణతో సఖ్యత.. ప్రాజెక్టులు, నీరు విషయంలో కలిసి ముందడుగు.