తాజాగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్న ఓ వీడియోతో ఆపార్టీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ లలో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్టుతో రైతు మాదిరిగా డ్రామా ఆడిస్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గొర్రెలు కాచేవాడంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని నీచమైన భాషతో ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. అయితే మొదట ఇతగాడి బిల్డప్ చూసి అందరూ నిజంగా రైతు ఆవేదన చెందుతున్నాడని అనుకున్నారు. కానీ అతను చేసింది నటన అని తేలిపోయింది. గత ఎన్నికల ప్రచారంలో చేసిన వీడిలో కూడా బయటపడ్డాయి. లేని ప్రజా వ్యతిరేకత చూపించాలని ప్రయత్నించిన లోకేశ అండ్ టీంను సామాన్య ప్రజలు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు.
ఎన్నికలు అయిపోయాక కూడా ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడడం ఎందుకంటూ తిడుతున్నారు. సంస్కారహీనంగా ప్రవర్తించడం తెలుగు డ్రామాల పార్టీకి అలవాటైపోయిందని సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. కచ్చితంగా సదరు ఆర్టిస్టును, అతని వెనుకున్న లోకేశ్ టీంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో ఆయనకోసం పోలీసులు గాలించారు. అతని పేరు శేఖర్ చౌదరి అని, గుంటూరు జిల్లా, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం, తిప్పాలకట్ట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతనిని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు.