ఈ సామెత అక్షరసత్యం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు గాక మేయదు. తమ నాయకుడు ఒక తరహాలో మాట్లాడుతోంటే.. ఆ అనుచరుల మంద మొత్తం అదే తరహాలో మాట్లాడుతుందే తప్ప.. తమ స్వబుద్ధితో వ్యవహరించదు. సొంత ఆలోచన మేరకు మాట్లాడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల తీరు అలా ఉంది అంటున్నారు వైసీపీ నేతలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటూ గతంలో టీడీపీ నేతల తీరుపై వైసీపీ ఎమ్.పి విజయసాయిరెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?’అని విజయసాయిరెడ్డి ఎద్దేవ చేశారు. తాజాగా ఇదే సామెత హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అండ్ కో కుల అహంకారం చూడండి అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇంతకి బాబు ఏమన్నారంటే
దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న బాబు
BC లు జడ్జీలుగా పనికిరారు అంటూ కేంద్రానికి లేఖ రాసిన బాబు
రాయలసీమ రౌడీలు, గుండాలు అంటూ ఇండైరెక్ట్ గా రెడ్లను అవమానిస్తున్న బాబు
తన కులస్థుల సినిమాల్లో రెడ్లను విలన్ లుగా బ్రాహ్మిన్స్ ను జోకర్ లుగా చూపిస్తాడు బాబు
మొన్న ఎన్నికలప్పుడు టీడీపీ TV ప్రకటనల్లో కనిపించిన పైడ్ ఆర్టిస్ట్ చేత గొర్రెలు కాచుకొనే అనిల్ యాదవ్ గాడికి మంత్రి పదవి ఇస్తే వరదలను మేనేజ్ చేయడం వస్తుందా అని హేళనగా చులకనగా మాట్లాడించారు. టీడీపీ వాళ్ళు, కుల పిచ్చి అవినీతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక టీడీపీ నే అవునా కదా తమ్ముల్లూ అంటూ 2013 లో తన మనసులో మాట బయట పెట్టిన లోకేష్ గుర్తుకుతెస్తున్నారు