తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఈ పర్యటనలో బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నా రు. సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి, ఇతర అధికారులు పాల్గొననున్నారు.
